ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ చేయ‌డం, మెసేజ్‌ల‌ను యాక్సెస్ చేయ‌డానికి గైడ్‌

మీరు వేరే ఫోన్ కాల్‌లో బిజీగా ఉన్నా లేక‌పోతే కాల్ ఆన్స‌ర్ చేసే ప‌రిస్థితి లేక‌పోయినా అవ‌తలివారు మీకు ఆడియో మెసేజ్ పంప‌వ‌చ్చు. దీన్నే వాయిస్ మెయిల్ అంటారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్లు ఎవ‌ర‌యినా ఈ వాయిస్ మెయిల్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  మ‌న దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు వాడేవారే ఎక్కువ కాబట్టి ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెసేజ్ సెట్ చేయ‌డం, వాటిని యాక్సెస్ చేయ‌డం ఎలాగో చూద్దాం.

 ఏమిటీ వాయిస్ మెయిల్ ?
ల్యాండ్ ఫోన్లు వాడేవారు తాము అందుబాటులో లేన‌ప్పుడు కాల‌ర్‌కు ఆన్స‌ర్ ఇవ్వ‌డానికి ఆన్స‌రింగ్ మెషీన్లు పెట్టుకునేవారు. ఇప్ప‌టికీ కొన్ని దేశాల్లో ఇవి ఉప‌యోగిస్తున్నారు. ఇందులో మ‌నం కాల్ చేసిన‌ప్పుడు  అవ‌త‌లి వ్య‌క్తి ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోతే ఆన్స‌రింగ్ మెషీన్ యాక్టివ్ అవుతుంది. బీప్ సౌండ్ విన్నాక మీ మెసేజ్ చెప్పండి. రికార్డ్ చేస్తాం అని స‌మాధానం ఇస్తుంది. మీ మెసేజ్‌ను స్టోర్ చేస్తుంది.  ఫోన్ య‌జ‌మాని వ‌చ్చి ఆన్స‌రింగ్ మెషీన్‌ను ప్రెస్ చేస్తే అప్ప‌టి వ‌ర‌కు రికార్డ్ చేసిన మెసేజ్‌ల‌ను వినిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని మెసేజ్‌ల వ‌ర‌కే స్టోర్ చేసుకోవ‌చ్చు. ఇదే ప్రొసీజ‌ర్‌లో సెల్‌ఫోన్ల‌లో వాయిస్ మెయిల్ కూడా ప‌ని చేస్తుంది. అయితే అవ‌త‌లివారి వాయిస్ మెసేజ్ ఫోన్‌లో కాకుండా స‌ర్వ‌ర్‌లో సేవ్ అవుతుంది.  

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ చేయడం ఎలా?
* ఇందుకోసం మీరు మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్‌ను కాంటాక్ట్ చేయాలి.  వాయిస్ మెయిల్ స‌ర్వీస్ యాక్టివేట్ చేయ‌మ‌ని అడ‌గాలి. కొన్ని కంపెనీలు దీనికి ఛార్జీలు వ‌సూలు చేస్తున్నాయి. 

* ఇప్పుడు మీ సెల్‌లో ఫోన్ యాప్‌ను టాప్ చేయండి. టాప్‌లో ఉండే మూడు చుక్క‌ల‌ను క్లిక్ చేయండి. 

* వ‌చ్చిన ఆప్ష‌న్ల‌లో సెట్టింగ్స్‌ను సెల‌క్ట్ చేయండి. 

* దీనిలో Voicemail ఉంటుంది. క్లిక్ చేయండి. 

* Voicemail settings క్లిక్ చేసి మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ ఇచ్చిన వాయిస్ మెయిల్ నెంబ‌ర్‌న ఎంట‌ర్ చేసి ఓకే నొక్కండి. అంతే మీఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ అయిపోయింది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెయిల్‌ను చెక్ చేసుకోవ‌డం ఎలా? 
* ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఫోన్ యాప్‌ను క్లిక్ చేయండి.

*  డ‌య‌ల్‌పాడ్ సింబ‌ల్‌ను నొక్కండి. ఇందులో వ‌న్ నంబ‌ర్‌ను ప్రెస్ చేసి ప‌ట్టుకోండి. 

*  వ‌న్ నెంబ‌ర్ డిఫాల్ట్ వాయిస్ మెయిల్ నెంబ‌ర్ కూడా. మీరు దాన్ని ప్రెస్ చేసి ప‌ట్టుకోగానే వాయిస్ మెయిల్ మీకు వినిపిస్తుంది. 

యాప్స్‌తో కూడా
YouMail, Google Voice లేదా HulloMailతో మీ వాయిస్ మెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు. ఇందులో మీకొచ్చిన వాయిస్‌మెయిల్స్ లిస్ట్ రూపంలో క‌నిపిస్తాయి. కావ‌ల్సిన దాన్ని సెల‌క్ట్ చేసుకుని వినే ఆప్ష‌న్ ఉంటుంది. 

* వీటిలో ఏదైనా ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

*  సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ను క్లిక్ చేయండి. 

* విజువ‌ల్ వాయిస్ మెయిల్‌ను టాప్ చేసి ప‌ర్మిష‌న్స్ ఇవ్వండి. 
* ఇప్పుడు మీకొచ్చిన వాయిస్ మెయిల్స్ విజువ‌ల్ వాయిస్‌మెయిల్ గా అంటే లిస్ట్ మాదిరిగా క‌నిపిస్తాయి. 

How To Set Up Voicemail On Android Voice mail in Android phone> వాయిస్‌మెయిల్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెయిల్ వాయిస్ మెయిల్‌కు సింపుల్ గైడ్‌ Â